కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం బదిలీపై వెళ్తున్న జిల్లా గ్రామీణ సంక్షేమ అధికారి (డీజీడబ్ల్యూఓ) ఎం. సతీష్ మరియు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి (డీబీసీడీఓ) కె. జయరాజ్ లకు ఘన సన్మానం జరిగింది. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా పాల్గొని, అధికారులకు జ్ఞాపికలు అందజేసి సన్మానించారు.
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ, బదిలీపై వెళ్తున్న అధికారుల సేవలను ప్రశంసించారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో వారు అందించిన సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. వారి భవిష్యత్ బాధ్యతల్లో మరింత ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ), అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో)తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అధికారులు వారి సేవలను గుర్తుచేసుకుంటూ అభినందనలు తెలియజేశారు.
అనంతరం ఎం. సతీష్, కె. జయరాజ్ లను శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. జిల్లా పౌర సంబంధాల అధికారిణి, కామారెడ్డి జిల్లా వారి చే ఈ ప్రకటన జారీ చేయబడింది.












