తెలంగాణ రాష్ట్రంలో మార్చి 6 నుండి ప్రారంభం కానున్న “ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని గాంధారి మండల కాంగ్రెస్ పార్టీ యూత్ ఉపాధ్యక్షుడు మేల్డే లక్ష్మన్ స్వాగతించారు. గ్రామాలలోని కనీస మౌలిక వసతుల కల్పన, సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించడం అభినందనీయమని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన ఈ ప్రణాళికలో భాగంగా, ప్రతి గ్రామంలో పరిశుభ్రత, తాగునీరు, రహదారులు, విద్యుత్, డ్రైనేజీ వంటి సమస్యలను 99 రోజుల్లో పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మేల్డే లక్ష్మన్ తెలిపారు.
ఈ కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి దిశానిర్దేశకంగా నిలుస్తుందని, ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా గుర్తించి, వేగవంతంగా పరిష్కరించడం ద్వారా గ్రామీణాభివృద్ధికి నూతన ఊపిరి లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రజాపాలన ద్వారా ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువ అవుతుందని, ఇది గ్రామీణాభివృద్ధికి దోహదపడుతుందని లక్ష్మన్ ఆశాభావం వ్యక్తం చేశారు.


