కామారెడ్డి, 2026-07-15
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పల్ వాయి గ్రామాన్ని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని సౌకర్యాలను ఆయన పరిశీలించారు. విద్యార్థుల విద్యా, ఆటల కార్యకలాపాలను అభినందించారు.
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పల్ వాయి గ్రామంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పర్యటించి, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. ముందుగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన కలెక్టర్, పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ, ఉప్పల్ వాయి గ్రామానికి మొత్తం 25 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, వాటిలో 10 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, మిగిలిన 15 ఇళ్ల పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.
ఉప్పల్ వాయి హైస్కూల్లో చదివే విద్యార్థులు చదువులోనే కాకుండా సైన్స్ ఫెయిర్ లో కూడా చాలా ఉత్సాహంతో ఉన్నారని తెలిపారు. విద్యార్థులకు విద్యతో పాటు ఆటలు, సైన్స్ ఫెయిర్ లో మంచి విద్యను అందిస్తున్నారని అన్నారు. ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కనకంటి శివారాణి రాజేందర్, ఉప సర్పంచ్ పార్వరెడ్డి, ప్రధానోపాధ్యాయులు ఆనందరావు, పంచాయతీ సెక్రెటరీ అరుణ్, ఎంపీడీవో నాగేశ్వర్, ఎమ్మార్వో ఉమలత, సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు.











