కండి, జూలై 13
జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.సౌజన్య కంది సెంట్రల్ జైలును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జైలులోని సౌకర్యాలు, ఖైదీల పరిస్థితులు, భోజనం వంటి అంశాలపై ఆరా తీశారు.
జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ హైదరాబాద్ వారి ఆదేశాల మేరకు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూచనలతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.సౌజన్య కంది సెంట్రల్ జైలును ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ తనిఖీలో భాగంగా, న్యాయమూర్తి సెంట్రల్ జైలులోని బెరక్లూ, గదులు, వంటగది, మరియు జైలు ఆవరణ మొత్తాన్ని పరిశీలించారు. ఖైదీలను కలిసి, జైలులో ఉన్న సదుపాయాలు, భోజనం గురించి అడిగి తెలుసుకున్నారు. అన్ని ఖైదీల బెరక్లూలను క్షుణ్ణంగా పరిశీలించిన ఆమె, వారికి కావాల్సిన అవసరాలు, సదుపాయాలు అన్ని అందేలా చూడాలని జైలర్ కు సూచించారు.
ఖైదీలకు సమయానికి బెయిల్స్, ములాఖత్ అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. కేసులు పరిష్కరించుకోవడానికి న్యాయ సేవలు పొందేందుకు ఉచితంగా న్యాయవాదిని నియమిస్తామని ఖైదీలకు తెలియపరిచారు. ఖైదీలకు అందిస్తున్న భోజనం రుచి చూశారు. ఖైదీల కోసం కేటాయించిన వంటగదిలో ఉన్న కూరగాయలు, బియ్యం నిల్వలను కూడా తనిఖీ చేశారు. జైల్లో ఉన్న లీగల్ ఎయిడ్ క్లినిక్ ను కూడా పరిశీలించారు. ఈ తనిఖీలో జైలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.











