కామారెడ్డి, 29.06.2026
జిల్లా పరిశ్రమల కేంద్రం (డీఐసీ) జనరల్ మేనేజర్ శ్రీ లాలు నాయక్ ప్రభుత్వ సేవ నుండి పదవీ విరమణ పొందనున్న సందర్భంగా, జిల్లా కలెక్టర్ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయనను ఘనంగా సన్మానించారు. ప్రజావాణి అనంతరం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన సేవలను కలెక్టర్ కొనియాడారు.
జిల్లా పరిశ్రమల కేంద్రం (డీఐసీ) జనరల్ మేనేజర్ శ్రీ లాలు నాయక్ ప్రభుత్వ సేవ నుండి పదవీ విరమణ పొందనున్న సందర్భంగా, జిల్లా కలెక్టర్ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయనను ఘనంగా సన్మానించారు. ప్రజావాణి కార్యక్రమం అనంతరం ఈ సన్మానం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ సేవలో శ్రీ లాలు నాయక్ అంకితభావంతో విధులు నిర్వహించి పరిశ్రమల అభివృద్ధికి విశేష కృషి చేశారని కొనియాడారు. ఉద్యోగ జీవితంలో నిజాయితీ, క్రమశిక్షణతో పనిచేసి అందరికీ ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ శాలువాతో సన్మానించి, జ్ఞాపిక అందజేసి పదవీ విరమణ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. రిటైర్మెంట్ అనంతరం ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, ఎన్వీ గిరి, జిల్లా స్థాయి అధికారులు, వివిధ శాఖల అధికారులు, పరిశ్రమల శాఖ సిబ్బంది పాల్గొని శ్రీ లాలు నాయక్‌ను అభినందించారు.











