వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్
ఎల్లారాం గ్రామంలో ధాన్యం ప్యాకింగ్, చెల్లింపుల వ్యవస్థపై సమీక్ష
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 13
లింగంపేట్ మండలం ఎల్లారాం గ్రామంలోని వరి కొనుగోలు కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సందర్శించి పరిశీలించారు. హమాలీలు వరి ధాన్యాన్ని సంచుల్లో నింపి ప్యాక్ చేస్తున్న తీరును కలెక్టర్ స్వయంగా దగ్గరుండి పరిశీలించారు. వారితో మాట్లాడి వారు ఎక్కడి నుండి వచ్చారో తెలుసుకున్నారు. వడ్ల ప్యాకింగ్, లారీ లోడింగ్ వేగంగా పూర్తిచేయాలని సూచించారు. ట్యాబ్ ఎంట్రీలు, చెల్లింపుల ప్రక్రియను అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.