*కామారెడ్డి ఆర్డీవో గా వీణ బాధ్యతల స్వీకరణ*
ప్రశ్న ఆయుధం న్యూస్, కామారెడ్డి :
కామారెడ్డి ఆర్డీవో గా వీణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ను కలిసి పుష్పగుచ్చం అందించారు. కామారెడ్డి లో ఆర్డిఓ గా పని చేసిన శ్రీనివాస్ రెండు నెలల క్రితం పదవీ విరమణ పొందారు. అప్పటినుండి ఎల్లారెడ్డి ఆర్డీఓ మన్నె ప్రభాకర్ ఇన్చార్జి ఆర్డీఓగా కొనసాగుతున్నారు. హైదరాబాదు నుండి వచ్చిన వీణ ప్రస్తుతం పూర్తిస్థాయి ఆర్డీఓగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమెకు వివిధ తహసీల్దారులు, రెవిన్యూ సిబ్బంది స్వాగతం పలికారు.