ప్రియురాలు ఫోన్ నంబర్ను బ్లాక్ చేసిందని యువకుడి ఆత్మహత్య
ప్రేమ విఫలమై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సూర్యాపేట జిల్లా బోడబండ్లగూడెంలో వెలుగుచూసింది. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువతితో ఏపూరి ప్రవీణ్ (28) ఐదేళ్లుగా ప్రేమాయణం సాగిస్తున్నాడు. ఇటీవల ఆమె వేరే వ్యక్తితో తరచూ మాట్లాడుతుంది. ప్రవీణ్ ఫోన్ నంబరును కూడా బ్లాక్లో పెట్టింది. దీంతో మనస్తాపం చెంది ప్రవీణ్ బుధవారం బోడబండ్లగూడెంలోని తన ఇంట్లో గడ్డి మందు తాగాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందాడు.