* *విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ పై* *అవగాహన*
ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల కామారెడ్డిలో కెరీర్ గైడెన్స్, కాంపిటేటివ్ కోచింగ్ సెల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు విద్య, వృత్తిపరమైన ఎంపికలకు సమగ్రమైన కెరీర్ గైడెన్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.విజయ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యాలను ఏర్పరచుకొని ప్రణాళిక బద్దంగా చదివినట్లయితే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని, చివరి సంవత్సరం చదువుతున్న డిగ్రీ విద్యార్థులు ఉద్యోగ, ఉపాధికి కావలసిన నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు. ఐక్యూఏసీ కోఆర్డినేటర్ అంకం జయప్రకాష్ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలని తధానుగుణంగా కష్టపడి పనిచేసే వాటిని చేరుకోవాలని సాధారణ వ్యక్తులు అసాధారణ ప్రతిభ పాటవాలు కనబరిచారని పుట్టుక సాధారణమే అయిన లక్ష్యం ఉన్నతంగా ఉండాలని సూచించారు. కెరీర్ గైడెన్స్, కాంపిటీటివ్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ రాజ్ గంభీర్ రావు మాట్లాడుతూ విద్యార్థుల కెరీర్ ఎంపికలను గుర్తించటానికి అవసరమైన జ్ఞానం, సమాచారం, నైపుణ్యాలు అనుభవాన్ని పొందటంలో ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్థశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఏ.సుధాకర్, హిందీ అధ్యాపకులు డాక్టర్ జి శ్రీనివాసరావు, హజారుద్దీన్, నవీన్, తదితరులు పాల్గొన్నారు.