నిజామాబాద్, జూలై 10
రాబోయే పండుగల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడంతో పాటు నేరాల నియంత్రణలో ఎలాంటి అలసత్వానికీ తావులేకుండా పనిచేయాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ ఆర్మూర్ డివిజన్ పోలీసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన డివిజన్ స్థాయి నేరాల సమీక్ష సమావేశంలో ఆయన పెండింగ్ కేసుల పురోగతిని సమీక్షించారు.
రాబోయే పండుగల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడంతో పాటు నేరాల నియంత్రణలో ఎలాంటి అలసత్వానికీ తావులేకుండా పనిచేయాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ ఆర్మూర్ డివిజన్ పోలీసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన డివిజన్ స్థాయి నేరాల సమీక్ష సమావేశంలో ఆయన పెండింగ్ కేసుల పురోగతిని సమీక్షించారు. సమావేశంలో ఆర్మూర్ ఏసీపీతో పాటు సీఐలు, ఎస్‌హెచ్‌వోలు, ఎస్సైలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు పండుగల సందర్భంగా చెక్‌పోస్టుల వద్ద ఇరవై నాలుగు గంటలపాటు తనిఖీలు నిర్వహించాలని, వాహనాల తనిఖీల్లో నిర్లక్ష్యానికి తావు ఇవ్వొద్దని కమిషనర్ స్పష్టం చేశారు. హత్యలు, హత్యాయత్నాలు, చోరీలు, మహిళలపై నేరాలు, సైబర్ మోసాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, పేకాట, గుట్కా వ్యాపారాలకు సంబంధించిన కేసులను త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రౌడీషీటర్లు, పాత నేరస్థులు, బెయిల్‌పై విడుదలైన వారిపై నిరంతర నిఘా కొనసాగించాలని, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి పహారాను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. నిర్మల్, జగిత్యాల జిల్లాల సరిహద్దు ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే అనుమానితులపై ప్రత్యేక నిఘా ఉంచడంతో పాటు ఆయా జిల్లాల పోలీసులతో సమన్వయం పెంపొందించుకోవాలని సూచించారు.
మహిళల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని, షీ టీమ్స్, ఈగల్ టీమ్స్, చీతా ఫోర్స్ మరింత సమర్థంగా పనిచేయాలని ఆదేశించారు. విద్యాసంస్థలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో పర్యవేక్షణను పెంచాలని పేర్కొన్నారు. సైబర్ నేరాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు ఆన్లైన్ మోసాల బాధితులకు వెంటనే సహాయం అందించాలని సూచించారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, రెచ్చగొట్టే పోస్టులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
డ్రగ్స్, గంజాయి నిర్మూలన కోసం ప్రత్యేక దాడులు కొనసాగించాలని, అవసరమైతే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని కమిషనర్ ఆదేశించారు. అలాగే పేకాట, గుట్కా, అక్రమ ఇసుక రవాణా తదితర చట్టవ్యతిరేక కార్యకలాపాలపై నిరంతర దాడులు నిర్వహించాలని సూచించారు.












