భిక్కనూర్ మండల ప్రెస్ క్లబ్ ఎన్నిక..!
ప్రశ్న ఆయుధం భిక్కనూర్ అక్టోబర్ 31
భిక్కనూర్ మండల ప్రెస్ క్లబ్ ని శుక్రవారం రోజున ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులు బోడపుంటి శ్రీధర్, ఉపాధ్యక్షులు లింగాల నవీన్ గౌడ్, కార్యదర్శి బత్తుల భిక్షపతి,సలహాదారులు నాగన్నగారి కళ్యాణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్బంగా అధ్యక్షులు మాట్లాడుతూ..తనపై నమ్మకంతో అప్పగించిన పదవికి తగిన న్యాయం చేస్తూ.. జర్నలిస్ట్ ల సమస్యలకు కృషి చేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ లు వెంకటేష్, మస్తాన్, సిద్ధగిరి తదితరులు పాల్గొన్నారు.