ఏపీలో గ్రూప్2 పరీక్షల రగడ.. చంద్రబాబు సర్కార్ తీరుపై భగ్గుమన్న బొత్సా సత్యనారాయణ

*ఏపీలో గ్రూప్2 పరీక్షల రగడ.. చంద్రబాబు సర్కార్ తీరుపై భగ్గుమన్న బొత్సా సత్యనారాయణ*

రాష్ట్రంలో గ్రూప్ 2 మెయిన్స్ వాయిదా కోసం అభ్యర్థులు ఆందోళ బాట పట్టారు రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల పరీక్ష రద్దు కోరుతూ ధర్నాలు ఆందోళనలు సాగించారు ఇక సోషల్ మీడియాలో గ్రూప్ టు మెయిన్స్ పరీక్షను ప్రభుత్వం వాయిదా వేసింది అని ఒక వార్త ప్రచారం కాగా, గ్రూప్ 2 పరీక్షలు యధాతధంగా నిర్వహిస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.

*ఏపీలో గ్రూప్ 2 మెయిన్స్ రగడ*

నోటిఫికేషన్ లో రోస్టర్ మార్చిన తర్వాతే ప్రధాన పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థుల ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. ఇక ఆందోళన చేస్తున్న అభ్యర్థుల పైన పోలీసుల లాఠీచార్జీలు, అరెస్టులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. దీనిపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

*గ్రూప్ 2 రచ్చపై మండిపడిన బొత్సా సత్యన్నారాయణ*

గ్రూప్ 2 వ్యవహారంపై మాజీ మంత్రి, శాసన మండలి విపక్షనేత బొత్సా సత్యన్నారాయణ భగ్గుమన్నారు. గ్రూపు 2 అభ్యర్ధుల వ్యవహారంపై ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. ఈ గందరగోళానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన పేర్కొన్నారు .ఒకవైపు వాయిదా వేయిస్తున్నామంటూ చెప్పి మరోవైపు తమ చేతుల్లో లేదని చెప్పడం ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనం అన్నారు .

*అభ్యర్థుల జీవితాలతో చెలగాటమా ?*

నిన్నఅభ్యర్ధుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటున్నట్టు విద్యాశాఖమంత్రి ట్వీట్ చేశారని , ఇప్పుడు మళ్ళీ ఇలా అభ్యర్థుల జీవితాలతో ఆటలాడుతున్నారని అన్నారు.

మరోవైపు తాము వాయిదా వేయమనే చెప్పామంటూ ముఖ్యమంత్రి పేరుతో సర్క్యూలేట్ అవుతున్న ఆడియో రాష్ట్ర ప్రజలంతా విన్నారన్నారు .ఇంకోవైపు గ్రూప్ 2 పరీక్ష వాయిదా అంటూ వార్తలు వేసిన ఛానెళ్లు మీద కేసులు పెట్టారని మండిపడ్డారు.

*ఇంత గందరగోళ ప్రభుత్వాన్ని చూడలేదు*

ఇంత అయోమయం, గందరగోళం ఉన్న ప్రభుత్వాన్ని నేనెప్పుడూ చూడలేదు అంటూ ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చివరిదాకా వాయిదా వేస్తున్నామని నమ్మించి ఈ ప్రభుత్వం గ్రూప్ 2 అభ్యర్ధులను ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఆందోళన చేస్తున్న అభ్యర్ధులపైన పోలీసుల లాఠీఛార్జీని కూడా తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న అభ్యర్ధులను బేషరతుగా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

*పరీక్ష వాయిదా వెయ్యండి.. బొత్సా డిమాండ్*

ప్రభుత్వం తక్షణమే అత్యవసరంగా సమావేశమై గ్రూపు 2 అభ్యర్ధులకు స్పష్టతనివ్వాలన్నారు .ఇంతటి గందరగోళం మధ్య పరీక్ష నిర్వహణ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదన్నారు బొత్సా సత్యన్నారాయణ . ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే దీనిపై అత్యవసర సమావేశం నిర్వహించి పరీక్ష వాయిదా వేయాలని సూచించారు.అభ్యర్ధుల ఆందోళనపై స్పష్టతనిచ్చిన తర్వాత మాత్రమే పరీక్ష నిర్వహించాలన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment