కామారెడ్డి, 10-07-2026
కామారెడ్డి జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ కార్యాలయంలో జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (PHCs) పర్యవేక్షణ సిబ్బందితో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష సమావేశం జరిగింది. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డా. జె. వెంకటి అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో, కార్యక్రమాల పురోగతి, సేవల నాణ్యత, లక్ష్యాల సాధన వంటి అంశాలపై చర్చించారు.
జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (PHCs) పర్యవేక్షణ సిబ్బందితో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష సమావేశం కామారెడ్డి జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ కార్యాలయంలో నిర్వహించబడింది. జిల్లాలో అమలవుతున్న జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పురోగతి, సేవల నాణ్యత, లక్ష్యాల సాధన వంటి అంశాలపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించారు.
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి (DM&HO) డా. జె. వెంకటి అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలులో నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.
మాతా-శిశు ఆరోగ్యం, కుటుంబ నియంత్రణ, సాధారణ టీకాల కార్యక్రమం (UIP), క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం (NTEP), మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా వంటి వ్యాధుల నియంత్రణ, రక్తహీనత నివారణ, అసంక్రమిత వ్యాధుల (NCD) స్క్రీనింగ్, ఆయుష్మాన్ భారత్ – ఆరోగ్య & వెల్నెస్ కేంద్రాల సేవలు, RBSK, RKSK, PMSMA, PCPNDT చట్టం అమలు, CEA, HFR నమోదు, ఆరోగ్య సంస్థల పర్యవేక్షణ, వ్యాధుల నిఘా (IDSP), ఆరోగ్య విద్య కార్యక్రమాలు వంటి పలు అంశాలపై సమీక్షించారు.
ప్రతి ఆరోగ్య కేంద్రం పరిధిలో ప్రభుత్వ ఆరోగ్య సేవలు సమర్థవంతంగా అందేలా చర్యలు తీసుకోవాలని, రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని, ఫీల్డ్ పర్యవేక్షణను బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. వర్షాకాలంలో వ్యాధుల నివారణ చర్యలు, పారిశుద్ధ్య కార్యక్రమాలు, ప్రజల్లో ఆరోగ్య అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని ఆదేశించారు.
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డా. జె. వెంకటి, డిప్యూటీ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, ఎల్లారెడ్డి డా. సి. నర్సింగ్ చౌహాన్, ప్రోగ్రామ్ ఆఫీసర్ (AAM) డా.జి.రాజు, ప్రోగ్రామ్ ఆఫీసర్ (NCD) డా.బి.వెంకటస్వామి, ప్రోగ్రామ్ ఆఫీసర్ (RNTCP/NTEP) డా. ప్రదీప్, బి. మహేందర్ రెడ్డి Dy. DEMO, చలపతి, శ్రీనివాస్ రెడ్డి, సాలమ్మ ఎస్ ఓ, కె. జీవన్ డి పి ఏం ఒ, శోభ, అశ్విని, సంతోష్ రెడ్డి, మరియు జిల్లాలోని అన్ని PHCల సి హెచ్ ఓ లు, హెచ్ ఈ ఓ లు, హెల్త్ సూపర్వైజర్లు, ఇతర పర్యవేక్షణ సిబ్బంది పాల్గొన్నారు.











