సంగారెడ్డి, జూలై 8
సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో పనిచేస్తున్న 17 మంది FDHS-104 ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగుల పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం సీపీఎం ఆధ్వర్యంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రికి లేఖ రాశారు.
సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఆరోగ్య సేవలను అందిస్తున్న 17 మంది FDHS-104 ఫార్మాసిస్ట్ మరియు ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగుల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బుధవారం సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి గారికి లేఖ రాయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత సంవత్సర కాలంగా జీతాలు రాక ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జీతాలు లేక కుటుంబ పోషణ గడవక ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తక్షణమే సమస్య పరిష్కారం చేయాలని కోరారు.
పిల్లల స్కూల్ మరియు కాలేజీ ఫీజులు, ఇంటి అద్దెలు, రుణాలు వంటివి కట్టలేక ఉద్యోగులందరూ అప్పులపాలవుతున్నారని, వెంటనే జీతాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.












