సంగారెడ్డి, జూలై 15
పటాన్చెరు మండలంలోని ఇస్నాపూర్, భానూర్ గ్రామాల్లోని ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ కేంద్రాలు, క్లినిక్‌లపై జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి (డీఎంహెచ్‌వో) డా.కె.లలితాదేవి ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో పలు నిబంధనల ఉల్లంఘనలు వెలుగు చూడడంతో సంబంధిత సంస్థలపై కఠిన చర్యలు చేపట్టారు.
జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి (డీఎంహెచ్‌వో) డా.కె.లలితాదేవి ఆధ్వర్యంలో పటాన్చెరు మండలంలోని ఇస్నాపూర్, భానూర్ గ్రామాల్లో బుధవారం ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ కేంద్రాలు, క్లినిక్‌లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో పలు నిబంధనల ఉల్లంఘనలు వెలుగు చూడడంతో సంబంధిత సంస్థలపై కఠిన చర్యలు చేపట్టారు.
తనిఖీల సందర్భంగా ఇస్నాపూర్ గ్రామంలోని వి కేర్ మీనాక్షి హాస్పిటల్లో గర్భిణీలకు సంబంధించిన Form-F రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడం గుర్తించారు. దీంతో సంబంధిత స్కానింగ్ గదిని అధికారులు సీజ్ చేశారు. అదేవిధంగా, ఇస్నాపూర్‌లో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న రెండు ఆర్ఎంపీ (RMP) క్లినిక్‌లను సీజ్ చేసి, నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేయాలని అధికారులకు సూచించారు.
భానూర్ గ్రామంలో నిర్వహించిన తనిఖీలలో సన్ షూర్ క్లినిక్ మరియు అపోలో డయాగ్నస్టిక్స్ సంస్థలు నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించి వాటిని కూడా సీజ్ చేశారు. అలాగే యోగి రాజ్ ఫిజియోథెరపీ అండ్ రిహాబిలిటేషన్ క్లినిక్‌లో గుర్తించిన లోపాలపై నోటీసులు జారీ చేయడంతో పాటు జరిమానా విధించారు.
ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో డా. కె. లలితా దేవి మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన వైద్య సంస్థలు ప్రభుత్వ నిబంధనలు, చట్టాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నిబంధనలను ఉల్లంఘించే ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు, అనుమతులు లేని క్లినిక్‌లపై భవిష్యత్తులో కూడా కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.
ఈ తనిఖీలలో ఎన్సీడీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. దీప్తితో పాటు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.












