Delhi, జూలై 13
జిల్లాలో "జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం" సందర్భంగా సోమవారం మాక్లూర్ మండలం దాస్నగర్లోని మహాత్మా జ్యోతిబా ఫూలే హైస్కూల్లో ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ భుజంగరావు ప్రారంభించారు. ఒకటి నుంచి 19 ఏళ్లలోపు విద్యార్థులందరికీ ఈ మాత్రలు పంపిణీ చేస్తున్నారు.
జిల్లాలో "జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం" సందర్భంగా సోమవారం మాక్లూర్ మండలం దాస్నగర్లోని మహాత్మా జ్యోతిబా ఫూలే హైస్కూల్లో ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ భుజంగరావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఒకటి నుంచి 19 సంవత్సరాల లోపు ఉన్న విద్యార్థులందరికీ ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. నులిపురుగుల నివారణ ద్వారా విద్యార్థుల శారీరక, మానసిక ఎదుగుదల మెరుగుపడుతుందని చెప్పారు. నులిపురుగులు, కొంకిపురుగులు వంటి పరాన్నజీవుల వల్ల రక్తహీనత, అలసట, కడుపునొప్పి, విరేచనాలు, జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. అందువల్ల విద్యార్థులంతా ఆల్బెండజోల్ మాత్రను బాగా నమిలి మింగాలని సూచించారు.
వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, భోజనం చేసే ముందు, మలవిసర్జన అనంతరం తప్పనిసరిగా చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. పోషకాహారం తీసుకోవడం, పరిశుభ్రమైన జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజశ్రీ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 3,90,297 మంది ఒకటి నుంచి 19 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు అందజేయనున్నట్లు తెలిపారు. చేతివేళ్లు, గోళ్లను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ముఖ్యంగా బాలికలు రక్తహీనత నివారణకు ఐరన్, క్యాల్షియం, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. ఈరోజు మాత్ర తీసుకోని విద్యార్థులకు జూలై 20న నిర్వహించే 'మాప్-అప్ డే'లో తప్పనిసరిగా మాత్ర అందజేస్తామని తెలిపారు.
కార్యక్రమంలో డీఐఓ డాక్టర్ అశోక్, రీజినల్ కోఆర్డినేటర్ సత్యనాథ్ రెడ్డి, డీఈవో అశోక్, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ సికందర్ నాయక్, పాఠశాల ప్రిన్సిపాల్ స్వప్న, ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ శిఖర, డాక్టర్ నవ్య, వైద్యాధికారులు డాక్టర్ రాజశ్రీ, డాక్టర్ అజ్మల్, డాక్టర్ అరవింద్, డిప్యూటీ డెమో దుర్గారావు, డీహెచ్ఈఓ ఘన్పూర్ వెంకటేశ్వర్లు, డీఈఐసీ మేనేజర్ సచిన్, సీహెచ్వో గిరిబాబు, ఆర్బీఎస్కే సిబ్బంది, పర్యవేక్షణ అధికారులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.












