ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆత్మ కమిటీ చైర్మన్ కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి

సంగారెడ్డి/పటాన్ చెరు, అక్టోబర్ 31 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కొత్తపల్లి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆత్మ కమిటీ చైర్మన్ కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలకు అనుగుణంగా ధాన్యం తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వం రైతుల పక్షాన ఎల్లప్పుడూ నిలుస్తుందని, వారికి న్యాయమైన ధర లభించేందుకు చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. రైతులు నాణ్యతా ప్రమాణాలు పాటించి ధాన్యం విక్రయిస్తే సకాలంలో చెల్లింపులు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం నరేందర్ కుమార్, సీసీ కృష్ణ, గ్రామ సమైక్య అధ్యక్షురాలు శ్రీలత, వీఏవో మాధవి, గ్రామ సమైక్య సెక్రటరి అఖిల, రైతులు ప్రభు, ఆగం రాజు, నీరుడి నర్సింలు, సురేష్, నవీన్, కిషోర్ గౌడ్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment