అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టీటీయు సంగారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో సదాశివపేటలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు మహిళల ప్రాముఖ్యతను, సాధికారత ఆవశ్యకతను నొక్కి చెప్పారు.
సదాశివపేట ప్రభుత్వ నూతన ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, సమాజ పురోగతిలో మహిళల పాత్ర అనివార్యమని, నేటి సమాజానికి వారే వెలుగు రేఖలని పేర్కొన్నారు. తల్లిగా, భార్యగా, సోదరిగా మహిళలు పోషించే పాత్రలను ఆయన ప్రశంసించారు.
టీజీవో జిల్లా అధ్యక్షుడు వైద్యానాథ్ మాట్లాడుతూ, మహిళలు అన్ని రంగాలలో, అంతరిక్షం నుంచి రక్షణ రంగం వరకు తమదైన ప్రతిభను చాటుకుంటున్నారని తెలిపారు. టీటీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఎం. మోహన్, మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ఆకాంక్షించారు.
టీటీయూ జిల్లా అధ్యక్షుడు పి. ప్రసాద్ మహిళల ఆర్థిక, సామాజిక ఎదుగుదల దేశాభివృద్ధికి మూలమని స్పష్టం చేశారు. సదాశివపేట మండల విద్యాధికారి ఎన్. శంకర్, మహిళా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రస్తావిస్తూ, వారి నిబద్ధతను కొనియాడారు.
ఈ సందర్భంగా టీటీయూ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పలువురు మహిళా ఉద్యోగులకు, అధ్యాపకులకు ఈ కార్యక్రమంలో బహుమతులు అందజేశారు.








