సంగారెడ్డి, జూలై 21
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. సంగారెడ్డిలోని తన నివాసంలో మంగళవారం BLAలు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు సూచనలు చేశారు.
ఎస్ఐఆర్ (ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ) ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. ఆందోల్ నియోజకవర్గంలోని మునిపల్లి, రాయికోడ్, ఆందోల్, పుల్కల్, చౌటకూర్, రేగోడ్, వట్పల్లి, అల్లదుర్గ్ మండలాల BLAలు, మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో సంగారెడ్డిలోని తన నివాసంలో మంగళవారం సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో వేగవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్స్ కు, సర్పంచ్ లు, ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులకు అవగాహన కల్పించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేయరాదని BLAలకు మంత్రి సూచించారు.
ఓటర్లతో సమన్వయం చేసుకొని గడువులోగా SIR ప్రక్రియను పూర్తిచేసి, ఎన్యూమరేషన్ ఫారాలను డిజిటలైజ్ కోసం బూత్ లెవెల్ అధికారుల (BLO)లకు అందించాలని మంత్రి సూచించారు. BLAలు బూతుల వారీగా సమన్వయం చేసుకొని కార్యకర్తలు, BLAలు, ప్రజా ప్రతినిధులు సహకరించుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో PCC డాక్టర్స్ సెల్ చైర్మన్ డా. రాజీవ్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, జోగిపేట మున్సిపాలిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ చిట్టిబాబు, ఆందోల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిల్లోడి సతీష్, బాలాజీ నరసింహులు, దుర్గారెడ్డి, దశరథ్, రమేష్ జోషి, శివరాజ్, శేషారెడ్డి, దిగంబర్ రావు, రమేష్, మాజీ చైర్మన్ మల్లయ్య, కౌన్సిలర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, సర్పంచులు, ముఖ్య నాయకులు, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.











