ఎమ్మెల్సీలుగా ప్రసన్న హరికృష్ణ,, యటకారి సాయన్నలను గెలిపించండి 

ఎమ్మెల్సీలుగా ప్రసన్న హరికృష్ణ,, యటకారి సాయన్నలను గెలిపించండి

ప్రశ్న ఆయుధం – కామారెడ్డి

బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా కార్యాలయం కామారెడ్డి కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఎస్పీ అభ్యర్థిగా మన బహుజన బీసీ ముద్దు బిడ్డ, అసిస్టెంట్ ప్రొఫెసర్ కు రాజీనామా చేసిన ప్రసన్న హరి కృష్ణ కు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బి యస్ పి అభ్యర్థి బహుజన బిసి బిడ్డ ఉపాధ్యాయ ఉద్యోగానికి రాజీనామా చేసిన సాయన్న లకు పట్టభద్రులు, ఉపాధ్యాయులు అందరు కలిసి వీరికి మొదటి ప్రాధాన్యత ఓట్లు వేసి గెలిపిచాలని బి యస్ పి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మాలోత్ హరిలాల్ నాయక్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కోకొండ రాజేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి దుంపల సురేష్, కామారెడ్డి అసెంబ్లీ అధ్యక్షులు ఈసిరి కాయల సాయిలు, కామారెడ్డి అసెంబ్లీ ఉపాధ్యక్షులు నత్తి జీవన్, ఈసరి హరి భూషణ్, తదితరులు పాల్గొన్నారు.

ప్రసన్న హరికృష్ణ ని భారీ మెజారిటీతో గెలిపించాలి

– విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు కొత్మీర్కర్ వినయ్ కుమార్

ప్రసన్న హరికృష్ణ ని భారీ మెజారిటీతో గెలిపించాలని విద్యార్థి సేన కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు కొత్మీర్కర్ వినయ్ కుమార్ పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆదివారం విద్యార్థి సేన ఆధ్వర్యంలో అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్,మెదక్ పట్టబద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తరపున విస్తరంగా ప్రచారం విద్యావేత్త, మేధావి, సమాజం పట్ల అవగాహన ఉన్న వ్యక్తి కార్పొరేట్, కామన్ మ్యాన్ కి మధ్య జరుగుతున్న పోరాటంలో పట్టభద్రులు అందరు ఏకమై నిరుద్యోగ సమస్యలు తెలిసిన వ్యక్తి తన 19 సంవత్సరాల సర్వీస్ ను వదులుకొని తెలంగాణ సమాజం కోసం, యువత కోసం ముందుకు వస్తున్నటువంటి డాక్టర్ ప్రసన్న హరి కృష్ణ ని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని పట్టభద్రులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సేన నాయకులు సతీష్, వంశీ, రాజు, రాహుల్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment