పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి
మెదక్, సెప్టెంబరు 17 (ప్రశ్న ఆయుధం న్యూస్): మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం అవరణలో నిర్వహించిన సెప్టెంబర్ 17 ప్రజా పరిపాలన దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి రాజి రెడ్డి, మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ లు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కొల్చారం మండల అధ్యక్షుడు మల్లేష్ గౌడ్, కౌడ్డిపల్లి మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రావు, నాయకులు వెంకటరామిరెడ్డి, ధన్సింగ్, గుడూర్ కృష్ణ గౌడ్, పూల్ సింగ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.