కామారెడ్డి, 2026-07-09
టీజీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ 90% పూర్తయిందని, కేవలం గెజిట్ తేదీని ప్రకటించాల్సి ఉందని టీజేఎంయు వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ అన్నారు. అయితే, కొన్ని యూనియన్ల నాయకులు ముందు యూనియన్ ఎన్నికలు నిర్వహించాలని, ఆ తర్వాతే గెజిటెడ్ తేదీ ప్రకటించాలని ద్వంద వైఖరి అవలంబించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరాన్ని కల్పించిన నాయకులకు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు.

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్.అండ్ .బి గెస్ట్ హౌస్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వంలో విలీనం చేయాలని మొట్టమొదటిసారిగా ప్రకటించి, ముందు నుంచి పోరాటం చేసింది తానేనని అన్నారు. ఎప్పుడూ ఎన్నికలను కోరుకోలేదని తెలిపారు. ఇప్పుడు వస్తున్న ఎన్నికల్లో తప్పనిసరిగా టీజేఎంయు పోటీ చేస్తుందని, కాబట్టి కార్మికులు ఆలోచించి టీజేఎంయుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గుర్తింపు సంఘంగా గెలిపించాలని ఆయన కార్మికులకు పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డేమాన్ సాములయ్య, కోశాధికారి పిఎస్ఎస్ రాజు రావు, నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి మాజీ ఎంపీ మెంబర్ సాయిలు, కామారెడ్డి డిపో కార్యదర్శి అలీ, టీజేఎంయు నాయకులు సయ్యద్ ఇసాక్, బాబుషా, రాజేష్ పాల్గొన్నారు.