మాదక దవ్యాలు,సైబర్ నేరాలపై అవగాహన
యువతలో పెడదారి అలవాట్ల నిర్మూలన
ప్రశ్న ఆయుధం
కామారెడ్డి జిల్లా నవంబర్ 21
కామారెడ్డి జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ M. రాజేష్ చంద్ర IPS ఆదేశాల మేరకు, పిట్లం సబ్–ఇన్స్పెక్టర్ G. వెంకట్రావు పర్యవేక్షణలో రాంపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం పోలీస్ శాఖ కళాబృందం ద్వారా మాదక ద్రవ్యాలు, యువత పెడదారి, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు మరియు సామాజిక సమస్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం పోలీస్ కళాబృంద ఇన్చార్జ్ హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి, U. శేషరావు, PCs ప్రభాకర్, సాయిలు పాటలు, మాటల రూపంలో విద్యార్థులకు సైబర్ నేరాల ముప్పు, డ్రగ్స్ ప్రమాదాలు, రోడ్డు భద్రత ప్రాముఖ్యం, డ్రంక్ అండ్ డ్రైవ్, మొబైల్ వాడకం వల్ల జరిగే ప్రమాదాలు, యువతలో పెరుగుతున్న దుష్ప్రవర్తనల గురించి సులభంగా అర్థమయ్యేలా వివరించారు.
ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ
సైబర్ నేరాల టోల్‌ఫ్రీ: 1930,
షీ టీమ్స్: 8712686094,
అత్యవసర సమయాల్లో డయల్ 100 ఉపయోగించాలని విద్యార్థులకు సూచించారు.
అలాగే పిల్లలపై హింస, బాల్య వివాహాలు, మహిళలపై నేరాలు, సోషల్ మీడియా లో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వాడకంలో జాగ్రత్తలు, తల్లిదండ్రుల మాట వినడం, వారిని గౌరవించడం వంటి విలువలపై ప్రత్యేకంగా చర్చించారు.
ఈ కార్యక్రమంలో ASI రాచప్ప, హెడ్ కానిస్టేబుల్ సాయగౌడ్, స్కూల్ హెడ్మాస్టర్ P. శ్రీలత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.