పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవం సాధించిన గ్రామాలకు రూ.10 లక్షల ప్రోత్సాహకం: బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి

సంగారెడ్డి/పటాన్ చెరు, నవంబరు 27 (ప్రశ్న ఆయుధం న్యూస్): పటాన్‌చెరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం సమగ్రంగా అభివృద్ధి చెందాలని భావిస్తూ, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవం సాధించిన గ్రామాలకు రూ.10 లక్షల ప్రోత్సాహక నిధులు అందజేస్తామని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ప్రకటించారు. గురువారం గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. పటాన్‌చెరు నియోజకవర్గంలోని 11 గ్రామ పంచాయతీలలో ఏకగ్రీవం సాధించిన గ్రామాలకు రూ.10 లక్షల ప్రోత్సాహక నిధులు అందజేస్తామని తెలిపారు. గ్రామాల్లో ఏకగ్రీవాన్ని ప్రోత్సహించడం ద్వారా సామరస్య వాతావరణం నెలకొని, వేగవంతమైన అభివృద్ధికి దోహదం అవుతుందని చెప్పారు. ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు కలిసి పని చేస్తే పటాన్‌చెరు నియోజకవర్గం రాష్ట్రంలో ఆదర్శంగా నిలుస్తుందని ఆయన అభిప్రాయ పడ్డారు. యువత, మహిళలు, రైతులు, కార్మికులు అభివృద్ధిలో భాగస్వాములవ్వాలని కోరారు. గ్రామాలలో సాగునీటి సదుపాయాలు, విద్యుత్తు సమస్యలు, మురుగు నీటి శుద్ధి, వీధి దీపాలు, కమ్యూనిటీ హాల్స్, పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామాల్లో ఏకగ్రీవంతో ఏర్పడే శాంతి–సామరస్య వాతావరణం మరింత పురోగతికి దారి తీస్తుందని, పటాన్‌చెరు అభివృద్ధిలో భాగస్వాములయ్యే ప్రతి గ్రామానికి తాము అండగా ఉంటామని చిమ్ముల గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment