ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

*ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం*

ప్రశ్న ఆయుధం న్యూస్, కామారెడ్డి టౌన్ :

ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల కామారెడ్డిలో క్యాన్సర్ గురించి అవగాహన పెంపొందించడానికి, దాని నివారణ, గుర్తింపును చికిత్సను ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4 న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంగా జరుపుకుంటారని, దీనిలో భాగంగా విమెన్ ఎంపవర్మెంట్ సెల్ ,ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల కామారెడ్డి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కామారెడ్డి సంయుక్తంగా ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులుగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. విజయకుమార్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ బయటి ఆహార పదార్థాలను తీసుకోకుండా, ఇంట్లో తయారుచేసిన పరిశుభ్రమైన ఆహారాన్ని భుజించాలని తెలిపారు. డాక్టర్ రాధా రమణ, ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎంఏ మాట్లాడుతూ వ్యక్తి జీవితంలో క్రమశిక్షణ ప్రముఖ పాత్ర వహిస్తుందని, ఆరోగ్యమే మహాభాగ్యం అని వివారించారు. డాక్టర్ అరవింద్ మాట్లాడుతూ విద్యార్థి దశలో సరైన ఆహారపు అలవాట్లు కలిగి ఉండాలని వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవాలని తెలిపారు. డాక్టర్ స్నేహసాగర్ అంకాలజిస్ట్ కిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్ విద్యార్థులకు క్యాన్సర్ నివారణ పట్ల అవగాహన కల్పిస్తూ, స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్స్ మూడింటికి దూరంగా ఉండాలని, యువత ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటూ, అమ్మాయిలు తగిన సమయంలో వ్యాక్సిన్ తీసుకోవాలని పరీక్షలు చేయించుకోవాలని, తొలి దశలో క్యాన్సర్ని గుర్తించగలిగితే పూర్తిగా నివారించవచ్చని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె విజయ్ కుమార్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె.కిష్టయ్య, డాక్టర్ కృప, ఉమెన్ ఎంపవర్మెంట్ కోఆర్డినేటర్ బి శ్రీవల్లి, అధ్యాపకులు డాక్టర్ దినకర్, డాక్టర్ జి. శ్రీనివాసరావు, మానస, ఖాదర్ ఉన్నిసా, రాజశ్రీ, ఫర్హీన్ ఫాతిమా, శారద, స్వాతి, శ్రీలత పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment