ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మహాధర్నా చలో ఇందిరా పార్క్
ప్రశ్న ఆయుధం – కామారెడ్డి
బాన్స్ వాడ పట్టణలో రోడ్లు భవనాల శాఖ అతిథిగృహలో నిర్వహించిన సమావేశంలో లో సీఐటీయూ జిల్లా నాయకులు జె రవీందర్ మాట్లాడుతు కేంద్ర బడ్జెట్ను వ్యతిరేకిస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద సిఐటియు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ ధర్నాలో మున్సిపల్ కార్మికులు, ఆశ వర్కర్లు, మధ్యాహ్న భోజనం కార్మికులు, అంగన్వాడీలు, గ్రామపంచాయతీ కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతులు బడ్జెట్లో తెలంగాణకు బిజెపి పార్టీ తీవ్ర ద్రోహం చేసిందన్నారు. బిజెపి కి తెలంగాణ నుండి ఎనిమిది మంది ఎంపీలు, అందులో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారలంగాణ గురించి మాట్లాడకపోవడం చాలా సిగ్గుచేటు బీజేపీ ఎంపీ మాట్లాడి తెలంగాణకు బడ్జెట్లో వాటా తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటి యూ ) మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు బుజ్జి, సాయిలు తదితరులు పాల్గొన్నారు.