సమస్యల పరిష్కారానికి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాదయాత్ర

సమస్యల పరిష్కారానికి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాదయాత్ర

ప్రశ్న ఆయుధం మే04: శేరిలింగంపల్లి ప్రతినిధి

IMG 20250504 WA2726 scaled

డివిజన్ లోగల రాజీవ్ గృహకల్పలో నూతనంగా చేపట్టే సీసీ రోడ్డు పనులను మరియు స్థానికప్రజలు ఎదుర్కోంటున్న పలు సమస్యలను పరిష్కరించే దిశగా శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ నేరుగా మార్నింగ్ వాక్ లో భాగంగా పాదయాత్ర చేపట్టారు. రాజీవ్ గృహకల్ప పరిసర ప్రాంతల్లో విస్తృతంగా పర్యటించి, స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా నెలకొన్న పలు సమస్యలు కార్పొరేటర్ దృష్టికి తీసుకురావడంతో వాటిని సకాలంలో పరిష్కరించేలా తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అనంతరం గోపిచెరువులో ప్రధాన నాలా పనులు మధ్యలో నిలిపివేసిన కారణంగా కార్పొరేటర్ సందర్శించి హైడ్రా సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి నాలా పనులను త్వరితగతిన పూర్తిచేయమని, గోపిచెరువులో ఉన్న మురికి నీటిని తొలిగించమని ఆదేశించారు. తద్వారా డ్రైనేజీ నీరు చెరువులో నిల్వకుండ ఉంటుందని, డ్రైనేజీ నీటి వల్ల చెరువులో గుర్రపుడెక్క పేరుకుపోయిందని, దోమల బారి నుండి ఉపశమనవుతుందని, శాశ్వతంగా సమస్య పరిష్కారమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ సెక్షన్ ఎఈ భాస్కర్, పాపిరెడ్డి నగర్ ప్రెసిడెంట్ బద్దం కొండల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, వార్డ్ మెంబర్ శ్రీకళ వెంకటేశ్వర్లు, సందయ్య నగర్ కాలనీ ప్రెసిడెంట్ బస్వరాజ్, సురభి కాలనీ ప్రెసిడెంట్ చంద్రశేఖర్, బసవయ్య, కుటుంబరావు, యోగేశ్వర్రావు, షఫీ, నర్సింలు, సారయ్య గౌడ్, మహేందర్, కుమార్, కొండల్ రెడ్డి, రవీందర్, మల్లికార్జున, శివ, గోపాల్, నారాయణ, కమలాకర్, బాబ్జి, శాంతరావు, రాములు, మహిళలు సుజాత, కుమారి, సుధారాణి, లక్ష్మి, జయ, జయలక్ష్మి, సునీత, ఛాయదేవి, సౌజన్య, సత్యవతి, గౌసియా స్థానికవాసులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment