సిద్దిపేట, నంగునూర్, ఫిబ్రవరి 23 (ప్రశ్న ఆయుధం న్యూస్): దాశరథి సాహిత్య సమాలోచన”15″లో భాగంగా “దాశరథి గజళ్ళు” అనే అంశంపై డాక్టర్ గడ్డం శ్యామల చేసిన ఉపన్యాసంలో పాల్గొన్న మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల, తెలుగు అతిధి ఉపాధ్యాయుడు దేవులపల్లి రమేశ్ ప్రశంసలు అందుకున్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ, కార్యదర్శి డాక్టర్ నామోజు బాలాచారి, తెలుగు భాషా చైతన్య సమితి, అధ్యక్షులు పి.బడేసాబ్, డా.ఎ డ్ల కల్లేష్, అభినందిస్తూ అంతర్జాలం ద్వారా పంపిన ప్రశంస పత్రాన్ని కవి, రచయిత దేవులపల్లి రమేశ్ అందుకున్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలుగు భాషా చైతన్య సమితి ఆధ్వర్యంలో మహాకవి దాశరథి కృష్ణమాచార్య శత జయంతి ఉత్సవాలు (1925-2025) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కవులు కళాకారులు, సాహిత్య మేధావులు తదితరులు పాల్గొన్నారు.