తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయి సమావేశం కామారెడ్డిలో శుక్రవారం జరగనుంది. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఈ విషయాన్ని తెలిపారు.
ఈ జిల్లా స్థాయి సమావేశం 22-05-2026న ఉదయం 10 గంటలకు కామారెడ్డి పట్టణంలోని సత్య కన్వెన్షన్ హాల్లో ప్రారంభమవుతుంది.
సమావేశంలో జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాల పురోగతి, 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు వంటి కీలక అంశాలపై సమీక్ష నిర్వహించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ సమీక్షా సమావేశానికి సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయ మిత్రులు, వివిధ శాఖల సిబ్బంది హాజరు కావాలని ఆహ్వానించారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. జిల్లా పౌర సంబంధాల అధికారిణి కార్యాలయం ద్వారా ఈ ప్రకటన విడుదలైంది.











