కామారెడ్డి పట్టణంలో పోలీసుల కొవ్వొత్తుల ర్యాలీ
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్న అధికారులు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి (ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 31
కామారెడ్డి: పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా కామారెడ్డి పట్టణంలో శుక్రవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. రాత్రి 7 గంటలకు న్యూ బస్టాండ్ నుండి నిజాంసాగర్ చౌరస్తా వరకు పోలీసులు కొవ్వొత్తులు వెలిగించి నిశ్శబ్ద ర్యాలీగా సాగారు. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది బృందంగా పాల్గొన్నారు.