వికారాబాద్ జిల్లా…
లగచర్లను సందర్శించిన ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య.
సోమవారం కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, జిల్లెల శంకర్, నీలాదేవి లతో కలిసి లగచర్ల, రోటిబండ తండాలో జరిగిన సంఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ప్రజల నుండి తగు సమాచారాన్ని సేకరించారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడుతూ… జరిగిన సంఘటన దూరదృష్టకరమని, తమ సమస్యలు ఏమైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని, అధికారుల పై తిరగబడడం సరిఅయిన విధానం కాదని అన్నారు. సంఘటన జరిగిన పరిణామాల అనంతరం జరుగుతున్న విషయాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. సంఘటనలో లేని వారిని కూడా పోలీసులు అరెస్టు చేస్తున్నారని ప్రజలు కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకురాగా… ఇట్టి విషయాన్ని జిల్లా కలెక్టర్, ఎస్పి దృష్టికి తీసుకు వెళ్తానని ఎవరు అధైర్య పడకూడదని ఆయన తెలిపారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ తమ హక్కుల కోసం పనిచేస్తుందని, మీ బాధలు, సమస్యలను కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్తామని ఆయన తెలిపారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారమే ప్రభుత్వం భూ సేకరణ చేపడుతుందని, బలవంతంగా భూసేకరణకు పూనుకోదని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా లగచర్ల, రోటిబడ్డ తాండ, పోలేపల్లి, హకీంపేట్ లలో భూ సేకరణ వివరాలను రెవెన్యూ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
చైర్మన్ తో పాటు ఎస్సి వెల్ఫేర్ అధికారి మల్లేశం, సంబంధిత అధికారులు ఉన్నారు..