*ఆర్మూర్‌లో వరల్డ్ క్యాన్సర్ డే*
నిజామాబాద్ ఫిబ్రవరి04
పట్టణంలో లయన్స్ క్లబ్ ఆఫ్ నవనాథపురం ఆధ్వర్యంలో మంగళవారం వరల్డ్ క్యాన్సర్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాన్సర్ బారినపడి కోలుకున్నవేల్పూర్ మండలం పడగల్ మాజీ ఎంపీటీసీ వెలమల గంగామణిని సన్మానించారు. క్యాన్సర్ బాధితులు ధైర్యం కోల్పోవద్దని ఆమె సూచించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పృథ్వీరాజ్, కోశాధికారి నారాయణ గౌడ్, చెన్న రవి, విజయానంద్, కార్యదర్శి సురేష్ కుమార్, దయశీల్, పుణ్యరాజ్, రామాగౌడ్, తదితరులు పాల్గొన్నారు.