ఎమ్మెల్సీ ఎన్నికలవేళ ఉద్యోగుల సమావేశం..!

– ప్రభుత్వ కార్యాలయంలో ఉండవలసిన ఉద్యోగులు యూనియన్ కార్యాలయంలో..?

– ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు..!

– ఎన్నికల కోడ్ ఉండగా ఉద్యోగులు సమావేశాలు నిర్వహించుకోవచ్చా…?

ప్రశ్న ఆయుధం కామారెడ్డి

ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఉద్యోగులు ప్రభుత్వ కార్యాలయాల పని వేళల్లో తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ కార్యాలయంలో సమావేశం నిర్వహించుకోవడం జిల్లా కేంద్రంలో చర్చనీయాంశగా మారింది. జిల్లా కేంద్రంలోని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం ఉద్యోగులు తమ విధులకు వెళ్లారా లేక వెళ్లలేదా సమావేశాన్ని మాత్రం నిర్వహించుకున్నారు. ఈ సమావేశానికి విలేకరులు వెళ్లగా జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు వచ్చి తాము ఎమ్మెల్సీ ఎన్నికల గురించి మాట్లాడుకోవడం లేదని కేవలం డైరీ ఆవిష్కరణ కోసమే చర్చించుకుంటున్నామన్నారు. నూతన సంవత్సరం ప్రారంభమై నెల 5 రోజులవుతున్న ఇప్పటివరకు వారి డైరీ ఆవిష్కరణ కాలేదు అంటే ఎవరికి నమ్మశక్యంగా కాలేదని పలువురు విమర్శిస్తున్నారు. ఈ విషయంపై జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయానికి వెళ్లగా ఎన్నికల సమయంలో ఉద్యోగులు సమావేశం నిర్వహించుకోరాదు అని ఈ విషయంపై పూర్తి సమాచారం కోసం అడిషనల్ కలెక్టర్ ను కలవాలని చెప్పడంతో అడిషనల్ కలెక్టర్ ఛాంబర్ వద్దకు వెళ్లగా అడిషనల్ కలెక్టర్ పలు సమావేశాలలో బిజీగా ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment