గ్రామ స్థాయిలో మినీ రైస్ మిల్లులు ఏర్పాటు చేయాలి 

గ్రామ స్థాయిలో మినీ రైస్ మిల్లులు ఏర్పాటు చేయాలి

జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

 

కామారెడ్డి జిల్లా ఇంచార్జ్

 

ప్రశ్న ఆయుధం నవంబర్ 12

 

జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మినీ రైస్ మిల్ పనితీరును జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బుధవారం పరిశీలించారు.

 

మినీ రైస్ మిల్ కార్యకలాపాలను సమీక్షించిన అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయిలో ఇలాంటి యూనిట్లు ఏర్పాటు చేయడం ద్వారా రైతులు, మహిళా సంఘాలకు ఆర్థిక లాభం చేకూరుతుందని తెలిపారు. దీన్ని ఒక ఎంటర్‌ప్రైజ్‌గా అభివృద్ధి చేయాలని, సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

 

మినీ రైస్ మిల్ గంటకు సుమారు 250 కిలోల వడ్లను ప్రాసెసింగ్ చేసి బియ్యంగా మారుస్తుందని, దీనికి సింగిల్ ఫేస్ కరెంట్ సరిపోతుందని, అలాగే పాలిష్ స్థాయిని అవసరానికి అనుగుణంగా నియంత్రించే సదుపాయం ఉందని అధికారులు వివరించారు.

 

కలెక్టర్ మాట్లాడుతూ ఈ సాంకేతిక పరిజ్ఞానం గ్రామీణ స్థాయిలో ఉపాధి అవకాశాలు సృష్టించడంలో, రైతుల ఆదాయం పెంపులో దోహదం చేస్తుందని పేర్కొన్నారు.

 

ఈ కార్యక్రమంలో DRDO శ్రీ సురేందర్, అదనపు DRDO విజయలక్ష్మి, DCO, DSCO, DPM, అన్ని మండలాల APM లు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment