ఘనంగా కాలభైరవ స్వామి జన్మదిన వేడుకలు 

ఘనంగా కాలభైరవ స్వామి జన్మదిన వేడుకలు

కామారెడ్డి జిల్లా ఇంచార్జ్

 

ప్రశ్న ఆయుధం నవంబర్ 12

 

కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఉగ్రరూపమైన శ్రీ కాలభైరవ స్వామి జన్మదిన వేడుకలను బుధవారం వైభవంగా నిర్వహించారు. రామారెడ్డి మండల ఈసన్నపల్లి గ్రామ శివారులో కొలువైన పవిత్ర పుణ్యక్షేత్రంను భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు సమర్పించుకున్నారు. కార్తీక మాస శుక్ల పక్ష అష్టమి సందర్భంగా జరిగే ఈ వేడుక స్థానికంగా విశేష ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా కాలభైరవుడి హావిర్భావ కథనం ఆలయంలో వేద పండితులు వివరిస్తూ బ్రహ్మ , విష్ణువు మధ్య జరిగిన వివాద సమయాన శివుని ఓంకార శక్తి నుంచి పుట్టిన భయంకర రూపమే కాలభైరవుడని భక్తులకు వివరించారు. భక్తులకు గ్రామ కమిటీ సభ్యులు, ఆలయ సిబ్బంది స్వామివారి ప్రసాదాన్ని అందించారు. అనంతరం విస్తృతస్థాయిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల ఈవో ప్రభు మాట్లాడుతూ కాలభైరవ స్వామి ఆలయ అభివృద్ధికి భక్తుల సహకారం అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండల సభ్యులు, ఇరు గ్రామాల విరాళాల దాతలు భక్తులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment