స్థానిక ఎన్నికలకు జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబర్ 27 (ప్రశ్న ఆయుధం న్యూస్): మొదటిదశ స్థానిక ఎన్నికలకు నామినేషన్స్ ప్రారంభమైన వేళ జిల్లాలోని వివిధ మండల కేంద్రాలలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను, అక్కడి బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ.. నామినేషన్ ప్రక్రియ శాంతియుతంగా జరుగేలా చూడాలని, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నామినేషన్స్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో మార్క్ చేసి, ఎవ్వరిని లోపలికి అనుమతించకూడదని, నామినేషన్స్ సమర్పించే అభ్యర్థులను ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అనుమతించాలని అన్నారు. అభ్యర్థి వెంబడి ముగ్గురు వ్యక్తులను మాత్రమే అనుమతించాలని అధికారులకు సూచించారు. ఎన్నికలను ప్రభావితం చేసే డబ్బు, మద్యం, క్రికెట్ కిట్స్ వంటివి పంపిణీ చేసి, ఓటర్లను మబ్యపెట్టిన, ప్రలోభాలకు గురిచేసినట్లు గమనించిన వెంటనే లోకల్ పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రశాంత వాతావరణాన్ని ప్రభావితం చేసే విధంగా ఇతర వ్యక్తులను గాని, రాజకీయ పార్టీలను గాని కించపరిచే విధంగా సామాజిక మాద్యమాలలో అనుచిత వ్యాఖ్యలు చేసిన, ఫార్వార్డ్ మెసేజ్ చేసినా, ఇతరుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించినా.. ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment