దీక్షా దివాస్ ను విజయవంతం చేయండి”:భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్

దీక్షా దివాస్ ను విజయవంతం చేయండి. పెద్ద ఎత్తున పాల్గొనాలని కార్యకర్తలకు పిలుపు. కేసీఆర్ దీక్షతో ఢిల్లీ మెడలు వంచారు. ప్రాణాత్యాగానికి సైతం వెనకాడలేదు. భవిష్యత్ తరాలకు ఉద్యమ స్ఫూర్తి తెలిసేలా కార్యక్రమాలు. భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్ వెల్లడి.

నేటి దీక్షా దివాస్ ను విజయవంతం చేయాలని భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్ పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున భారాస శ్రేణులు పాల్గొనాలని కోరారు. ప్రత్యేక తెలంగాణ కోసం కేసీఆర్ దీక్షా దివాస్ చేపట్టారని గుర్తు చేశారు. ఆ రోజును ఘనంగా నిర్వహించాలని, తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజుగా అభివర్ణించారు. ఆ ఉద్యమ స్ఫూర్తిని ప్రజలకు వివరించాలని భారాస శ్రేణులకు తెలిపారు. తెలంగాణ కోసం కేసీఆర్ ఆ నాడు ప్రాణత్యాగానికి కూడా వెనకాడలేదని కొనియాడారు. కేసీఆర్ చేసిన పోరాటంతో ఢిల్లీ తలవంచిందన్నారు. హస్తిన పెద్దలను తెలంగాణ ఇచ్చేలా చేసిన ఘనత కేవలం కేసీఆర్ పోరాటమేనని గుర్తు చేశారు. ఆయన గొప్పతనాన్ని భవిష్యత్ తరాలకు తెలియజెప్పాల్సిన అవుసరం ఉందని రవీందర్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లిలోని భారాస శ్రేణులు పెద్ద ఎత్తున దీక్షా దివాస్ లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై కేసీఆర్ పోరాట స్ఫూర్తితో పోరాడనున్నట్లుగా రవీందర్ యాదవ్ వెల్లడించారు. తెలంగాణలో రానుంది భారాస ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. కేటీఆర్ చేసిన పోరాటంతో దెబ్బకు రేవంత్ రెడ్డి దిగివచ్చి అదానీ 100 కోట్లను వెనక్కి ఇచ్చారన్నారు. తెలంగాణను గుజరాతీ గులామ్ లకు అప్పగిస్తామంటూ అసలైన తెలంగాణ వాదులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. భవిష్యత్ లో మరిన్ని పోరాటాలు చేయడానికి గులాబీ శ్రేణులు సిద్ధంగా ఉన్నారని, ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై నిలదీస్తూనే ఉంటామని రవీందర్ యాదవ్ వెల్లడించారు..

Join WhatsApp

Join Now