ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒక రోజు కార్యశాల కార్యక్రమం

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒక రోజు కార్యశాల కార్యక్రమం

ప్రశ్న ఆయుధం న్యూస్, కామారెడ్డి :

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ‘GST రూల్స్ ను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయటం ద్వారా ఆర్థిక వ్యవస్థ పై GST ప్రభావం’ అనే అంశంపై ఒక రోజు కార్యశాల నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. విజయ్ కుమార్ మాట్లాడుతూ కళాశాల విద్యార్థులు పోటీ ప్రపంచంలో ధీటుగా రాణించేందుకు వినూత్న పద్ధతిలో బోధనా తరగతులు నిర్వహిస్తున్నట్లు దీనిలో భాగంగానే సెమినార్లు, వర్క్ షాప్ లు జ్ఞానసమపార్జనకు విద్యార్థులకు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్ గా వ్యవహరించిన ప్రొఫెసర్ కస్తూరి శ్రీనివాస్ డైరెక్టర్ రీసర్చ్ సెంటర్, బేగంపేట్ హైదరాబాద్ విద్యార్థులకు ఇన్కమ్ టాక్స్, GST ప్రాధాన్యతులను రెండు సెషన్స్ గా విభజించి విద్యార్థుల యొక్క ఇంటరాక్షన్ తో వివరనాత్మకంగా విశదీకరించారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కిష్టయ్య మాట్లాడుతూ యూనివర్సిటీ స్థాయిలోనే నిర్వహించే ఇలాంటి వర్క్ షాప్ లు కళాశాలలో నిర్వహించటం కళాశాల ప్రమాణాలకు గీటురాయిగా నిలుస్తాయని, విద్యార్థులు ఈ వర్క్ షాప్ ద్వారా భవిష్యత్తు నిర్మాణానికి అన్వయించుకోవాలని అన్నారు. కామర్స్ విభాగ అధిపతి అంకం జయప్రకాష్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే పన్ను విధానం జీఎస్టీ అని తెలిపారు. అనంతరం ముఖ్యఅతిథిగా, రిసెర్స్ పర్సన్ గా హాజరైన ప్రొఫెసర్ కస్తూరి శ్రీనివాస్ ను శాలువా, మెమొంటతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల అకాడమిక్ సమన్వయకర్త డాక్టర్. విశ్వప్రసాద్, హిందీ ఉపన్యాసకులు డాక్టర్ జి. శ్రీనివాసరావు, అధ్యాపకులు ఎస్. కవిత, ఎం.విజయ్ కుమార్, తబస్సమ్, ఎస్. సత్య శ్రీ, మీరాబాయి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now