శని శింగనాపురం కృష్ణ శీల శని దేవుని కొలువు మూర్తి విగ్రహ ప్రతిష్టాపన చేసిన వేద పండితులు
కామారెడ్డి జిల్లా ఇంఛార్జి
(ప్రశ్న ఆయుధం) జులై 27
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ వైద్య నాథ ముక్తి క్షేత్రం ఆలయంలో శని శింగనాపురం కృష్ణ శీల శని దేవుని కొలువు మూర్తి ప్రతిష్టాపన వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో శని దేవునికి ప్రాణ ప్రతిష్ట క్షయాభిషేకం, ధాన్యాభిషేకం, క్షీరాభిషేకం, పాలాభిషేకం ధూప దీప నైవేద్యాలతో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా శనైశ్చర ప్రతిష్టాపన చేశారు. అనంతరం హోమం, పూర్ణాహుతి కార్యక్రమం, పూర్ణాహుతి సమయంలో స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి హాజరై పూజలో పాల్గొన్నారు . ఈ సందర్భంగా వేద పండితులు బ్రహ్మశ్రీ గంగారం ఆంజనేయ శర్మ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మొదటి క్షేత్రంగా శనైశ్చర ప్రతిష్టాపన కామారెడ్డి జిల్లాలో నెలకొల్పడం కామారెడ్డి జిల్లా ప్రజలు చేసుకున్న పూర్వ జన్య శుభపత్రమని తెలిపారు. కావున ప్రజలు శనైశ్చర క్షేత్రాన్ని ధరించుకోవడానికి మహారాష్ట్ర, తమిళనాడుకు వెళ్లవలసిన అవసరం లేదని, మీకు ఎలాంటి శని దోషాలు ఉన్న తొలగించే శనైశ్చర విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం చేసుకోవడం జరిగిందని ఈ విషయంలో కామారెడ్డి ప్రజలు చేసుకున్న పుణ్యఫలం అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు లింగ గౌడ్, ఆలయ కమిటీ అధ్యక్షులు నిమ్మల రవీందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు బాలకిషన్, లక్ష్మీరాజ్యం, రమేష్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి అనిల్ కుమార్, సహాయ కార్యదర్శిలు ,సభ్యులు భక్తులు పాల్గొన్నారు.