వైట్ కోట్ సెరిమనీ ఘనంగా 

వైట్ కోట్ సెరిమనీ ఘనంగా

 

ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్

 

జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ చేతుల మీదుగా నూతన MBBS విద్యార్థులకు వైట్ కోటులు

 

 

ప్రశ్న ఆయుధం

 

కామారెడ్డి జిల్లా ఇంచార్జ్ నవంబర్ 12

 

కామారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో MBBS మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం “వైట్ కోట్ సెరిమనీ” మరియు “కడవెరిక్ ఓత్” కార్యక్రమాలు బుధవారం ఘనంగా నిర్వహించబడ్డాయి.

 

ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి నూతన విద్యార్థులకు వైట్ కోటులు అందజేశారు.

 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ — “వైద్య వృత్తి అత్యంత పవిత్రమైనది. విద్యార్థులు నైతిక విలువలు, క్రమశిక్షణ, సేవాభావం, కర్తవ్యనిష్ఠతో ముందుకు సాగాలి” అని సూచించారు.

 

కలెక్టర్, ప్రభుత్వ వైద్య కళాశాల ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినందుకు అభినందనలు తెలిపారు.

 

కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి. వాల్య (MS), వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ S. M. V. కుమారి, హీరమాన్ (అసిస్టెంట్ డైరెక్టర్–అడ్మినిస్ట్రేషన్), అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment