యువత భవిష్యత్తు భద్రతకు పోలీసుల అవగాహన 

యువత భవిష్యత్తు భద్రతకు పోలీసుల అవగాహన

 

హనుమాన్ మందిర్ పాఠశాలలో పోలీస్ కళాబృందం అవగాహన

 

 

ప్రశ్న ఆయుధం

 

కామారెడ్డి జిల్లా, నవంబర్ 24:

 

కామారెడ్డి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ M. రాజేష్ చంద్ర IPS ఆదేశాల మేరకు, యువతలో పెరుగుతున్న పెడదారి ప్రేమలు, మోసాలు, మాదకద్రవ్యాల వినియోగం, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు వంటి కీలక సామాజిక సమస్యలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

 

సోమవారం రోజున కామారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (HMR), హనుమాన్ మందిర్ వద్ద జిల్లా పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

 

కార్యక్రమంలో షీ–టిమ్స్ సభ్యులు PC భూమయ్య, WPC సౌజన్య విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ సైబర్ నేరాల టోల్ ఫ్రీ నంబర్ 1930,అత్యవసర సేవల కోసం Dial 100, షీ టీమ్స్ హెల్ప్‌లైన్ 8712686094

వినియోగంపై సూచనలు ఇచ్చారు.

 

డ్రంక్ అండ్ డ్రైవ్, ఫోన్‌తో వాహనం నడపడం, గంజాయి–డ్రగ్స్ వ్యసనం, బాల్య వివాహాలు, మహిళలు–పిల్లలపై నేరాలు, మానవ అక్రమ రవాణా వంటి అంశాలపై PC రాజేందర్ విద్యార్థులకు సమగ్ర అవగాహన ఇచ్చారు.

 

“సెల్‌ఫోన్లు, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉండాలి” అని సూచించారు.

 

ఈ సందర్భంగా పోలీస్ కళాబృందం ఇన్‌చార్జి హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి, U. శేషరావు, PCs ప్రభాకర్, సాయిలు పాటలు మరియు మాటల రూపంలో డ్రగ్స్, సైబర్ నేరాలపై, రోడ్డు భద్రత ప్రాముఖ్యం గురించి, డ్రంక్ అండ్ డ్రైవ్, మొబైల్ వాడకం వల్ల జరిగే ప్రమాదాల గురించి విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా వివరించారు.

 

ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ G. అరుణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment