విస్ డమ్ కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
జమ్మికుంట పట్టణంలోని విస్ డమ్ కళాశాల 1999-2001 సంవత్సరంలో బైపీసీ చదివిన పూర్వ విద్యార్థులు సిల్వర్ జూబ్లీ పురస్కరించుకొని ఆత్మీయ సమ్మేళనం జమ్మికుంట పట్టణంలో ఆదివారం ఘనంగా నిర్వహించుకున్నారు. పూర్వ విద్యార్థులు అందరూ ఒకే వేదికపై కలుసుకొని తమ పూర్వపు రోజులను జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు ఒకరిని ఒకరు ఆత్మీయంగా పలకరించుకొని ఆనందంగా గడిపారు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువులను ఘనంగా సన్మానించారు అనంతరం వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులను ఆణిముత్యాలుగా తీర్చిదిద్దిన ఘనత ఒక్క విస్ డమ్ కళాశాలకే దక్కుతుందని వారు కొనియాడారు.ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.