జిల్లా అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్ష
పథకాల అమలులో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ సూచన
ప్రశ్న ఆయుధం
కామారెడ్డి జిల్లా ఇంచార్జ్ నవంబర్ 12
కామారెడ్డి జిల్లాలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాల అమలుపై మండల అభివృద్ధి అధికారులు (MPDO) తో సమీక్షా సమావేశం బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధ్యక్షత వహించారు. అదనపు కలెక్టర్లు విక్టర్, మదన్ మోహన్, జడ్పీ సీఈవో చందర్, DRDO సురేందర్, DPO మొగిలి సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధి, సంక్షేమం, మౌలిక వసతుల రంగాలలో జరుగుతున్న పనుల పురోగతిని సమీక్షించారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం, MGNREGS కింద చేపట్టిన పనులు, ఇసుకపోత భూముల అభివృద్ధి, నర్సరీలు, పన్ను వసూలు, విపత్తు నిర్వహణ మరమ్మత్తు పనులు, కార్మిక సమీకరణ వంటి అంశాలపై అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ —
> “ప్రతి మండల అభివృద్ధి అధికారి తమ పరిధిలోని పథకాలను సమయపాలనతో, నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలి. పేదల సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా చూడాలి. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం”అని పేర్కొన్నారు.
అలాగే ఇందిరమ్మ ఇళ్ల పథకం, మార్కౌట్ వర్క్ ప్రోగ్రెస్, చెకర్స్ ప్రోగ్రెస్, కన్వర్జెన్స్ వర్క్స్, IHHLS, DSR, పన్ను వసూలు పురోగతి, SERP కార్యక్రమాల షెడ్యూల్ పై సమీక్ష జరిపారు. గ్రామ స్థాయి అధికారులతో సమన్వయం పెంచి, పనులపై నిరంతర పర్యవేక్షణ చేయాలని ఎంపీడీఓలకు సూచించారు.
సమావేశంలో DRDA, SERP, MGNREGS, వ్యవసాయ, అటవీ, రెవెన్యూ విభాగాల అధికారులు పాల్గొన్నారు.