వికలాంగులకు ఉచిత ట్రైసైకిళ్ల పంపిణీ
పేదల పక్షానే కాంగ్రెస్ పార్టీ పోరాటం:
టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 21:
వికలాంగుల కోసం సొంత నిధులతో చంద్రన్న భరోసా ఉచిత ట్రైసైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం నిర్వహించారు. కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇస్రోజివాడ గ్రామానికి చెందిన కడారి లింగం, హరిజనవాడకు చెందిన రాజు వీర్ సింగ్, 36వ వార్డ్‌కు చెందిన కుమ్మరి సుమలతలకు ట్రైసైకిళ్లు అందజేశారు. పేదల పక్షాన నిలబడడం కాంగ్రెస్ పార్టీ బాధ్యత అని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. మాజీ మున్సిపల్ చైర్మన్ మామిళ్ల అంజయ్య, నిమ్మ విజయ్ రెడ్డి, కౌన్సిలర్లు ఊర్దొండ రవి, జూలూరి సుదాకర్, చాట్ల వంశీ, తదితర నాయకులు, యువజన ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు.