అజమాబాద్–గండివేట్ వయా వెల్లుట్లా రోడ్‌కు కొత్త వెలుగు*

*అజమాబాద్–గండివేట్ వయా వెల్లుట్లా రోడ్‌కు కొత్త వెలుగు*

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 22 

ఎల్లారెడ్డి నియోజకవర్గం 

ఎమ్మెల్యే మదన్ మోహన్ 

కృషితో ₹1.49 కోట్లు 

వ్యయంతో బి.టి పనులకు శ్రీకారం గ్రామాల్లో హర్షం

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గత ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అజమాబాద్ గండివేట్ వయా వెల్లుట్లా బి.టి రోడ్ నిర్మాణం చివరికి రూపుదిద్దుకుంటోంది. ప్రాంతీయ ప్రజలు తీవ్రంగా ఎదురుచూసిన ఈ రహదారి నిర్మాణానికి ₹1.49 కోట్ల నిధులతో పనులు ప్రారంభం కావడంతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది.

అడవి ప్రాంతంగా ఉండడంతో అనుమతుల సమస్యలు, నిధుల అటకాయింపు వంటి కారణాలతో రహదారి పనులు ఎన్నేళ్లుగా నిలిచిపోయాయి. పలువురు ప్రజా ప్రతినిధులు హామీలు ఇచ్చినప్పటికీ అమలు కాలేదు. అయితే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ, ప్రభుత్వం నుంచి నిధులు మంజూరయ్యేలా నిరంతరం ఫాలోఅప్ చేస్తూ, అటవీ శాఖ నుంచి అనుమతులు సాధించడంలో కీలకపాత్ర పోషించారు.

గ్రామ ప్రజలు తమ ఆశ నెరవేరుతుండటంపై హర్షం వ్యక్తం చేస్తూ మా రోడ్డు కోసం ఎన్నాళ్లుగా ఎదురుచూశాం. మాట నిలబెట్టిన నాయకుడు మదన్ మోహన్ గారే అని ప్రశంసలు కురిపించారు.

అడవి ప్రాంతంలో అనుమతులు తెచ్చుకోవడం, నిలిచిపోయిన ప్రక్రియలను మళ్లీ మొదలు లో పెట్టడం లాంటి క్లిష్ట దశలను అధిగమించి ప్రజల అభివృద్ధిని ముందుంచిన నాయకుడిగా ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు ప్రజల్లో విశేష ఆదరణ పొందుతున్నారు.

ప్రాంత అభివృద్ధికి మార్గం సుగమం చేస్తోన్న ఈ రహదారి నిర్మాణం త్వరగా పూర్తవుతుందనే నమ్మకం ప్రజల్లో నెలకొంది.

Join WhatsApp

Join Now

Leave a Comment