కామారెడ్డి జిల్లా పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు

కామారెడ్డి జిల్లా పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు

532 సర్పంచ్, 4,656 వార్డ్ సభ్యుల స్థానాలకు గెజిట్ విడుదల 

— కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 24

కామారెడ్డి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మొత్తం 532 గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాలకు, అలాగే 4,656 వార్డ్ సభ్యుల స్థానాలకు రిజర్వేషన్లను కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదివారం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా విడుదల చేశారు.

కోర్టు ఆదేశాల మేరకు 50 శాతం రిజర్వేషన్ల పరిమితి దాటకుండా రేషియోను కచ్చితంగా పాటిస్తూ రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో రానున్న పంచాయతీ ఎన్నికల్లో ఎవరు ఎక్కడ నుండి పోటీ చేయాలన్నది స్పష్టత వచ్చింది.

ఈ నోటిఫికేషన్ వెలువడడంతో గ్రామాల్లో రాజకీయ పరిణామాలు వేగం పుంజుకున్నాయి. అభ్యర్థుల కసరత్తులు, పార్టీల వ్యూహాలు ఇప్పటికే మొదలయ్యాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment