వందేమాతరం 150 సంవత్సరాలు – జాతీయ విద్యా దినోత్సవం వేడుకలు

సంగారెడ్డి, నవంబరు 12 (ప్రశ్న ఆయుధం న్యూస్):వందేమాతరం గేయం 150 సంవత్సరాలు మరియు భారత జాతీయ విద్యా దినోత్సవం పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ సంగారెడ్డి ఆదర్శ ఆధ్వర్యంలో చేర్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంలో “దేశాభివృద్ధిలో విద్యార్థుల పాత్ర” అనే అంశంపై సంగారెడ్డి నియోజకవర్గంలోని పోతిరెడ్డిపల్లి, ఇస్మాయిల్ ఖాన్ పేట, ఎద్దుమైలారం, మారేపల్లి, తొగర్ పల్లి తదితర పాఠశాలలలో విద్యార్థులకు వందేమాతర గేయాలాపన, వ్యాసరచన పోటీలు, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. విజేతలకు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పి. రామకృష్ణారెడ్డి, జిల్లా చైర్మన్లు పి.రాములుగౌడ్, యస్. విజయేందర్ రెడ్డి, యన్. రామప్ప, అనంతరావు కులకర్ణి, డి.హన్మంత్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారులు విద్యాసాగర్, దశరథ్, జోగప్ప, వెంకటరాజయ్య, సంజీవరావు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

విజేతల వివరాలు:

జి.ప.ఉ.పా. ఇస్మాయిల్ ఖాన్ పేట.

ఉపన్యాసం: ప్రథమ – కు. శ్రీలక్ష్మి (10వ), ద్వితీయ – యన్. దీపిక (10వ).

వ్యాసరచన: ప్రథమ – యల్. పావని (10వ), ద్వితీయ – యల్. శ్రీలక్ష్మి.

జి.ప.ఉ.పా. పోతిరెడ్డిపల్లి

వ్యాసరచన విజేతలు: షాలిని, అర్చన.

జి.ప.ఉ.పా. చేర్యాల

విజేతలు: శ్రావణి, జాహ్నవి.

జి.ప.ఉ.పా. మారేపల్లి

ఉపన్యాసం: ఆర్. సిందూర, యు.వందన.

వ్యాసరచన: సుహానా బేగం, యం. ప్రియాంక.

Join WhatsApp

Join Now

Leave a Comment