కామారెడ్డిలో కవిత రైలు నిలువరింపు… ఉద్రిక్తత

కామారెడ్డిలో కవిత రైలు నిలువరింపు… ఉద్రిక్తత

బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్, ఎమ్మెల్సీ కవితకు గాయం

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 28

కామారెడ్డి: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రైల్వే ట్రాక్‌పై అరగంటకు పైగా భైఠాయించారు. రైలు సమయం దగ్గరపడుతోందని ధర్నాను విరమించాలని పోలీసులు విజ్ఞప్తి చేసినా కవిత వెనక్కి తగ్గలేదు.

కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి స్వయంగా ఘటనాస్థలికి చేరుకుని కవితను సముదాయించేందుకు ప్రయత్నించినా ఆమె నిరసన కొనసాగించారు. దీంతో భారీగా పోలీసు బలగాలు చేరుకుని కవితను అరెస్ట్ చేయడానికి యత్నించగా జాగృతి కార్యకర్తలు కవిత చుట్టూ వలయంగా ఏర్పడి అడ్డుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.        పోలీసుల–కార్యకర్తల మధ్య తోపులాట జరుగుతుండగా, భారీ బందోబస్తు మధ్య పోలీసు సిబ్బంది కవితను అరెస్ట్ చేసి వాహనంలోకి తీసుకెళ్లారు. ఆమెను తరలించే సమయంలో కార్యకర్తలు వాహనాన్ని వెంటాడుతూ నిరసన తెలపడం గమనార్హం. కవితను ఆపడానికి జరిగిన రద్దీలో ఆమె కుడి చేతికి దెబ్బతగిలింది.  తరువాత స్టేషన్‌కు తరలించిన కవిత మాట్లాడుతూ—బీసీలకు ఇచ్చిన హామీ ప్రకారం 42% రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని, కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి తెలంగాణ బీజేపీ ఎంపీలు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment