శ్రీకాంతాచారి వర్థంతి సందర్భంగా డిసెంబర్ 3 న బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో “తెలంగాణ యూత్ డే” సదస్సు

డిసెంబర్ 3 న తెలంగాణ యూత్ డే గోడ పత్రికను ఆవిష్కరించిన కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి

ప్రశ్న ఆయుధం నవంబర్ 30:కూకట్పల్లి ప్రతినిధి 

తెలంగాణ జన సమితి అనుబంధ యువజన సమితి & విద్యార్థి జన సమితి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎర్ర వీరన్న ఆధ్వర్యంలో మలిదశ తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి వర్థంతి సందర్భంగా డిసెంబర్ 3 న బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో “తెలంగాణ యూత్ డే” సదస్సు గోడ పత్రికను కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శేరి సతీష్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమరుల‌ స్ఫూర్తిని మరిచి పరిపాలన చేసింది. గత నాలుగు సంవత్సరాలుగా అమరుడు శ్రీకాంతాచారి వర్థంతి‌ని *తెలంగాణ యూత్ డే* గా నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా నిరుద్యోగుల, యువత సమస్యలను‌ ప్రభుత్వం దృష్టికి తెచ్చే ప్రయత్నం చేశాము. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మేము లేవనెత్తిన జాబ్ క్యాలెండర్‌ ఏర్పాటు, రెగ్యులర్‌గా ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదల, మెస్ బిల్లుల పెంపు, స్కిల్ సెంటర్ల ఏర్పాటు తదితర డిమాండ్లను పట్టించుకోలేదు. కానీ 10 నెలల కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వీటిని పరిష్కరించింది. గత పదేళ్ళలో బీఆర్ఏస్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగులను తయారు చేసింది. కానీ ఒక లక్షా యాబైవేల ఉద్యోగాలు భర్తీ చేశామని తప్పుడు ప్రచారం చేసుకుంది. పది నెలల‌ ప్రజా ప్రభుత్వంలో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేసింది. జాబ్ క్యాలెండర్‌ ద్వారా మరిన్ని నోటిఫికేషన్లను జారీచేస్తుంది. గత బీఆర్ఏస్ పాలనలో ప్రయివేటు, ఐటీ రంగాలలో కూడా తెలంగాణ భూమిపుత్రులకు ఉద్యోగాలు దక్కలేదు. 

ప్రస్తుత ప్రజా ప్రభుత్వం స్కిల్ యూనివర్శిటీని ఏర్పాటు చేసి ఈ రంగాలలో ఉద్యోగ ఉపాధి కల్పన మీద దృష్టి పెట్టింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి నిరుద్యోగులు, యువత తరపున కృతజ్ఞత తెలుపుతున్నాం అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో యువత సమగ్రాభివృద్ధికై ఒక యువజన విధానం రూపొందించాల్సి ఉంది

తెలంగాణ స్థానిక యువకులకే పరిశ్రమలలో మెజారిటీ ఉద్యోగాలు దక్కేలా ఒక ప్రత్యేక చట్టం రావాలి

అలాగే, గంజాయి, డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా తెలంగాణను నిర్మించుకోవాలి

ఈ కార్యక్రమంలో కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు గోపాల్ చౌదరి, శ్రీధర్ చారి,గిరి నాయుడు,రాజు ముదిరాజ్, తోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now